![]() |
![]() |

గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది.
బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున. అయితే గీతు ఎంత హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు... బిగ్ బాస్ తర్వాత గీతూ షోస్ లో ఎక్కడ కన్పించలేదు కానీ రి యూనియన్ అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ లను తరచు కలుస్తూ ఉంటుంది.
ఈ మధ్య శ్రీలంక కి షిప్ లో వెళ్ళగా.. అక్కడ తను వ్లాగ్ చేయగా అత్యధిక వీక్షకాధరణ పొందింది. అలా గీతు ఈ మధ్య ఎక్కడికి వెళ్లిన చిరుత కాస్ట్యూమ్స్ లో దర్శనమిస్తుంది. తాజాగా గీతు తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. అది ఇప్పుడు వైరల్ గా మారింది. గీతు, వాసంతి కార్ లో వెళ్తున్న వీడియోని షేర్ చేసింది. అందులో మ్యూజిక్ ప్లే చేయగా చిరుత మూవీలోని చిరుత అనే సాంగ్ వచ్చింది. దాంతో గీతు కార్ డ్రైవ్ చేస్తూ.. నేనే చిరుతని నా డ్రెస్ చూడు చిరుత, నా వాచ్ చిరుత, నా హ్యాండ్ బ్యాగ్ చిరుత.. నా చెప్పులు చిరుత అంటూ చూపించింది. కాగా ఈ వీడియో చూసిన ప్రేక్షకులు ఈ గీతూకి ఇంకా తగ్గలేదని అనుకుంటున్నారు. కాగా శ్రీసత్య, వాసంతి, గీతు ముగ్గురు కలిసారు. ఇన్ స్టాగ్రామ్ లో వీళ్ళ ముగ్గురు కలిసి దిగిన ఫోటోలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి.
![]() |
![]() |